రైల్వేట్రాక్ పై శవం | Dead body found in railway track | Sakshi
Sakshi News home page

రైల్వేట్రాక్ పై శవం

May 8 2015 10:24 AM | Updated on Sep 3 2017 1:40 AM

రైల్వే ట్రాక్‌పై శవం పడిఉండటంతో స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది.

అదిలాబాద్: రైల్వే ట్రాక్‌పై శవం పడిఉండటంతో స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. తాండూరుకు చెందిన జంబుల లక్ష్మణ్(30) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తునాడు. గురువారం రాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లిన లక్ష్మణ్ శుక్రవారం ఉదయం రైలు పట్టాలపై విగతజీవిగా పడిఉన్నాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్ది ఆత్మహత్యా? లేక ఎవరైన హత్య చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement