కరెంట్ కోతలపై రైతుల నిరసన | Current farmers protest cuts | Sakshi
Sakshi News home page

కరెంట్ కోతలపై రైతుల నిరసన

Oct 11 2014 2:19 AM | Updated on Nov 6 2018 8:28 PM

కరెంట్ కోతలపై రైతుల నిరసన - Sakshi

కరెంట్ కోతలపై రైతుల నిరసన

కరెంట్ కోతలపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, మండల అధ్యక్షులు కొమ్ము రవి...

చేర్యాల, మహబూబాబాద్, జనగామ రూరల్ : కరెంట్ కోతలపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు.  కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, మండల అధ్యక్షులు కొమ్ము రవి ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని మండలంలోని ముస్త్యాల సబ్‌స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

కరెంట్ కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనిపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని పొన్నాల వైశాలి డిమాండ్ చేశారు. ముస్త్యాల కిష్టయ్య, ఉడుముల బాల్‌రెడ్డి, ఉట్లపల్లి శ్రీనివాస్, ముస్త్యాల యాదగిరి, నాగమల్ల భిక్షపతి, మాదాసు చంద్రమ్మ, బొమ్మగోని రవీంధర్, ఖుర్షీదాభేగం, మంచాల చిరంజీవులు, తాటిపాముల వెంకటేశం, బుడిగె గురువయ్య, వంగాల శ్రీదేవి, పచ్చిమడ్ల వెంకటయ్య, సత్యనారాయణ, పల్లె కనకయ్య, బండారి శ్రీశైలంలతో పాటు పలువురు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని ఏడీఈ కార్యాలయూన్ని రైతులు ముట్టడించారు. కరెంట్ కోతలతో ఎకరం పం టను పండించుకునే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలోజు శ్రీహరి, రాళ్ళబండి నాగరాజు, బద్దిపడగి క్రిష్ణారెడ్డి, నర్సిరెడ్డి, జయరాములు, ఇబ్రహిం, బాల మల్లు, కనకచారి, రాంచంద్రం, మహేశ్, బాల స్వామి, భూమిగారి ప్రభాకర్, పోచయ్య, కిష్టయ్యలతో పాటు పలువురు పాల్గొన్నారు.

మహబూబాబాద్ మండలం  కంబాలపల్లిలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ,  దాని అనుబంధ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కరెంటు కోతలపైన పలు సం ఘాలు, పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళణ కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని న్యూడెమోక్రసీ కురవి సబ్ డివిజన్ నాయకుడు వజ్జ రాము ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పార్టీ ఆధ్వర్యంలో రైతులకు అండగా నిలిచి ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామన్నారు.

కార్యక్రమంలో నాయకులు ఆలకుంట్ల కొమురయ్య, తుపాకుల వెంకన్న, సత్యం, లిం గయ్య, పెంటయ్య, ముత్తయ్య, పైండ్ల యాక య్య, వెంకన్న, రమేష్, రాజు, తదితరులు పా ల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యం లో జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. సంఘం డివిజన్ నాయకులు పంపర మల్లేశం, వై.బాలరాజు, ఏ.ఆంజనేయులు, పీ.అర్జున్, బీ.బాలరాజు, స్వామియాదగిరి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement