రవీంద్రకుమార్పై స్పీకర్కు ఫిర్యాదు | cpi complaints to speaker on defected MLA ravindra kumar to trs | Sakshi
Sakshi News home page

రవీంద్రకుమార్పై స్పీకర్కు ఫిర్యాదు

Jul 20 2016 4:05 PM | Updated on Aug 14 2018 2:34 PM

రవీంద్రకుమార్పై స్పీకర్కు ఫిర్యాదు - Sakshi

రవీంద్రకుమార్పై స్పీకర్కు ఫిర్యాదు

ఎమ్మెల్యే రవీంద్రకుమార్పై అనర్హతవేటు వేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన నల్లగొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్పై అనర్హత వేటు వేయాలంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బుధవారం స్పీకర్ మధుసూదనాచారికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరడం దుర్మార్గమన్నారు.

రవీంద్రకుమార్పై తక్షణమే అనర్హత వేటు వేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న అనర్హత పిటిషన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరినట్లు ఆయన తెలిపారు. కాగా పార్టీ నుంచి రవీంద్రకుమార్ను సీపీఐ బహిష్కరించింది కూడా. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరినట్లు రవీంద్రకుమార్ చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement