గ్యాస్ లీక్ ... దంపతులకు తీవ్ర గాయాలు | Couple injured in gas leak in kagaznagar | Sakshi
Sakshi News home page

గ్యాస్ లీక్ ... దంపతులకు తీవ్ర గాయాలు

Oct 31 2014 9:29 AM | Updated on Jul 10 2019 8:00 PM

ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లో గురువారం అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి.

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లో గురువారం అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్తో మంటలార్పారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. దీంతో అతడికి మెరుగైన వైద్య చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement