దంపతుల ఆత్మహత్యాయత్నం | couple attemped suicide in karimnagar district | Sakshi
Sakshi News home page

దంపతుల ఆత్మహత్యాయత్నం

Oct 3 2015 8:15 PM | Updated on Jul 10 2019 7:55 PM

కొనుగోలు చేసిన భూమికి తహశీల్దార్ మ్యుటేషన్ చేయడం లేదని..

బెజ్జంకి (కరీంనగర్): కొనుగోలు చేసిన భూమికి తహశీల్దార్ మ్యుటేషన్ చేయడం లేదని.. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం కీలాపూర్ గ్రామంలో దంపతులు శనివారం ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామానికి చెందిన అర్జున్, స్వరూప దంపతులు 2 ఎకరాల 37 గుంటల భూమిని కొనుగోలు చేశారు. దానికి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేయగా, రికార్డుల్లోని వివరాల ఆధారంగా 2 ఎకరాలకే మ్యుటేషన్ చేయడం వీలవుతుందని తహశీల్దార్ స్పష్టం చేశారు.


37 గుంటల భూమిని యజమాని అప్పటికే వేరొకరికి విక్రయించినట్టు ఆయన చెప్పారు. అయినప్పటికీ తాము కొనుగోలు చేసిన మొత్తం భూమికి మ్యుటేషన్ చేయాలని కోరగా, వీలు కాదని స్పష్టం చేయడంతో మనస్తాపం చెందారు. శనివారం అర్జున్, స్వరూప తమ ఇంట్లో పురుగుల ముందు తాగి పడిపోగా 108లో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement