మున్సిపల్‌ సేవలన్నీ ఒక కౌంటర్‌ ద్వారానే

 counter in municipal services  - Sakshi

ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పారదర్శకమైన పాలనను అందించేందుకు ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న సిటిజన్‌ సర్వీస్‌సెంటర్‌ను కార్పొరేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ పాపాలాల్‌ మాట్లాడుతూ నగర పాలక సంస్థ అందించే వివిధ సేవలను పొందేందుకు ప్రజలు సమర్పించే దరఖాస్తులను ఒకే కౌంటర్‌ ద్వారా స్వీకరించి ఆన్‌లైన్‌ ద్వారా అన్ని విభాగాలకు పంపనున్నట్లు తెలిపారు.

అనంతరం సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్, క్యాష్‌రూం, ఈ1, ఈ2 విభా గాలను కార్పొరేటర్లతో కలిసి పరిశీలించారు. అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇక ముందు దరఖాస్తులన్నీ ఈ ఆఫీస్‌ ద్వారానే స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మాటేటి నాగేశ్వరరావు, మందడపు మనోహర్‌రావు, చేతుల నాగేశ్వరరావు, పోతుగంటి వాణి, నీలం జయమ్మ, హనుమాన్, ఎస్సైలు శంకర్, లాల్య, లోకేశ్, ఎల్లయ్య, విజయ్‌కుమార్, భద్రం పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top