పత్తి పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూతురు వివాహం కోసం చేసిన అప్పు ఎక్కువవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పులబాధతో పత్తి రైతు ఆత్మహత్య
Jan 23 2016 2:43 PM | Updated on Nov 6 2018 7:56 PM
చింతపల్లి: పత్తి పంట పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో పాటు కూతురు వివాహం కోసం చేసిన అప్పు ఎక్కువవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం కొక్కిరాల తండలో శనివారం చోటు చేసుకుంది.
తండాకు చెందిన కొర్ర భాను(44) తనకున్న రెండున్నర ఎకరాల భూమితో పాటు మరో ఐదున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశాడు. ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పలు పెరిగిపోయాయి. దీనికి తోడు వారం రోజుల క్రితమే కూతురు వివాహం కోసం కూడా అప్పు చేశాడు. అవి తీర్చడం గురించి మధన పడుతున్న భాను ఈ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement