టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్ | corporator srilekha joining the TRS | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్

Jun 17 2016 12:16 AM | Updated on Sep 4 2017 2:38 AM

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖ దంపతులు గురువారం టీఆర్‌ఎస్‌లో

కాజీపేట రూరల్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 35వ డివిజన్ కార్పొరేటర్ బస్కే శ్రీలేఖ దంపతులు గురువారం టీఆర్‌ఎస్‌లో చేరారు. శ్రీలేఖ స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన విషయం విదితమే. ఈ మేరకు హన్మకొండ హంటర్‌రోడ్‌లోని వర్ధన్నపేట నియోజకవర్గ టీఆర్‌ఎస్ కార్యాలయంలో తన మద్దతుదారులు, కడిపికొండ కుచెందిన పలువురితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే రమేష్ మాట్లాడుతూ శ్రీలేఖ, ఆమె భర్త కృష్ణ టీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమన్నారు.


డివిజన్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాకుల రవీందర్, బి.రాంచంద్రారెడ్డి, దామెరుప్పుల కోటేశ్వర్, శంకర్‌బాబు, లక్ష్మీనారాయణ, కిశోర్, కన్నయ్య, బస్కె దశరథం, రమణారెడ్డి, కొడవటి అశోక్, బత్తిని సతీష్, బస్కె సాగర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement