టిక్‌టాక్‌ భారీ విరాళం

Coronavirus: TikTok donates medical equipment worth Rs 100 crore For Covid-19 Prevention - Sakshi

రూ. వంద కోట్ల విలువైన సూట్లు, మాస్కులు అందిస్తామని హామీ  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు టిక్‌టాక్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్‌ సూట్‌లు, రెండు లక్షల మాస్కు లు సమకూర్చేందుకు సిద్ధమైంది. వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. కరోనాను ఎదుర్కొనేం దుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని, వారు సురక్షితంగా ఉండటం అత్యవసరమని టిక్‌టాక్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు లక్షల ప్రత్యేక హజ్మత్‌ సూట్లు, రెండు లక్షల మాస్కులు వైద్యులకు అందించాలని నిర్ణయిం చినట్లు తెలిపింది. కేంద్ర జౌళి శాఖ సహకారం తో తాము నిర్ణీత ప్రమాణాలతో కూడిన సూట్లు, మాస్కులు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందజేయనున్నామని టిక్‌టాక్‌ వివరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top