‘పోలీసు’ల ఆరోగ్య భరోసాకు కాల్‌ సెంటర్‌ 

Coronavirus: Call center for ensuring health of Police Families - Sakshi

డీజీపీ కార్యాలయంలో నేటి నుంచి అందుబాటులోకి..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ 24 గంటలపాటు విరామం లేకుండా విధులు నిర్వహిస్తోన్న పోలీసులకు తెలంగాణ డీజీపీ కార్యాలయం మరో వినూత్న సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న పో లీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సందేహా లు నివృత్తి చేసేందుకు ప్రత్యేక కాల్‌సెంటర్‌ను ఏ ర్పాటు చేసింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కోసం పోలీసు లు 24 గంటలూ విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఓ పోలీసుకు కూడా కరోనా పాజిటివ్‌ రావడం, అతని సహచరులు 12 మందిని క్వారంటైన్‌కు తరలించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, వారి కుటుంబీకుల్లో ఒక విధమైన ఆందోళన మొదలైంది. అందుకే, ఎలాంటి అ నారోగ్య సమస్యలున్నా.. వెం టనే వాటి లక్షణా లు చెబితే.. తగిన సలహాలు ఇచ్చేందుకు ఉపయోగపడేలా ఈ కాల్‌ సెంటర్‌కు డీజీపీ మహేందర్‌రెడ్డి శ్రీకారం చుట్టా రు. గురువారం నుంచి దీని సేవలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల పరిధిలో పనిచేసే వారందరికీ అందుబాటులోకి రానున్నాయి. 

మానసిక ఆందోళన తగ్గించేందుకు.. 
ప్రతీ పోలీసు కుటుంబంలోనూ ఎవరో ఒకరికి వైద్యుడి అవసరం ఉండే ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే తల్లిదండ్రులు, గర్భిణులైన భార్యలు, వైద్య సదుపాయం అవసరమున్న పిల్లలు ఇలా కు టుంబీకుల్లో ఎవరో ఒకరికి ఏదో ఒక వైద్య అవస రం ఉంటుంది. ఇలాంటి వారిని ఇంట్లో పెట్టుకుని పోలీసులు సరిగా విధులు నిర్వహించలేరు. ఈ కాల్‌సెంటర్‌ అందుబాటులోకి వస్తే.. పోలీసులు నిశ్చింతగా డ్యూటీ చేసుకుంటారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇక పోలీసులు చాలామంది  కరోనా అనుమానితులను, పాజిటివ్‌ వ్యక్తులను ఆసుపత్రులకు తరలించడం తదితర పనుల కారణంగా తమకూ వైరస్‌ వ్యాప్తి చెందిందేమో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. చిన్న జలుబు వ చ్చినా తమకు కరోనా అంటుకుందేమోనని భయప డుతున్నారు. అందుకే, చిన్న ఆరోగ్య సమస్య నుం చి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఈ కాల్‌సెంటర్‌కు ఫో న్‌ చేసి చెబితే..ఆ కాల్స్‌ను సంబంధిత విభాగాల్లో నిపుణుడైన డాక్టర్‌కు బదిలీ చేస్తారు. ఇందుకోసమే గుండె, కిడ్నీ, బీపీ, గైనకాలజీ, పల్మనాలజీ, ఆప్తమాలజీ తదితర 20 విభాగాల నిపుణులైన వైద్యు ల బృందాలు వీరి కాల్స్‌కు సమాధానం ఇస్తాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top