వ్యవసాయ అభివృద్ధికి జన్యుమార్పిడి దోహదం | Contribute to the development of agriculture transgenic | Sakshi
Sakshi News home page

వ్యవసాయ అభివృద్ధికి జన్యుమార్పిడి దోహదం

Mar 30 2014 3:38 AM | Updated on Jun 4 2019 5:04 PM

జన్యు పరిజ్ఞానం వ్యవసాయాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని బీసీఐఎల్(బయోటెక్ కన్సోరియం ఇండియూ లిమిటెడ్) న్యూఢిల్లీ డెరైక్టర్ అహుజా అన్నారు.

వరంగల్, న్యూస్‌లైన్ : జన్యు పరిజ్ఞానం వ్యవసాయాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని బీసీఐఎల్(బయోటెక్ కన్సోరియం ఇండియూ లిమిటెడ్) న్యూఢిల్లీ డెరైక్టర్ అహుజా అన్నారు. జన్యు మార్పిడి పరిజ్ఞానం వినియోగించడం లో రైతులకు అనేక అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత వ్యవసా య పరిశోధకులపై ఉందన్నారు.

వరంగల్‌లో ని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో శనివారం జన్యుమార్పిడి పంటల అవగాహనపై సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరైన అహుజా మాట్లాడుతూ జన్యు మార్పిడి పంటల సాగుకు రైతులు వెనుకంజ వేస్తున్నారని, బీటీ పత్తి వినియోగం పెరిగినప్పటికీ వంకాయ, తదితర బీటీ విత్తనాలు వాడేందుకు జంకుతున్నారని అన్నారు. బీటీ పంటల వినియోగం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహ ఉందన్నారు.

రైతుల కు అందించే జన్యు మార్పిడి విత్తనాలకు సం బంధించి వ్యవసాయ పరిశోధనలు, అనేక పరీక్షలు నిర్వహించిన తరువాతనే వాటిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడులు పెంచేందుకు ఈ పరి జ్ఞానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా దేశవాళీ పంటల సాగు సందర్భంగా తెగుళ్లు సోకి దిగుబడి తగ్గి రైతు లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వీటిని తట్టుకొని సరైన సాగు పద్ధతులు అనుసరిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.

రైతుల్లో కలిగే అనుమానాలు ఎప్పటికప్పుడు తొలగించల్సిన బాధ్యత పరిశోధకులపై ఉంద ని వివరించారు. పరిశోధన కేంద్రం డెరైక్టర్ డాక్టర్ చేరాలు మాట్లాడుతూ సాగు దిగుబడి పెంచడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను  తట్టుకునే విధంగా జన్యుమార్పిడి పరిజ్ఞానం తో విత్తనాలు రూపొందిస్తే దిగుబడి పెరిగి రైతు ఆర్థిక స్థాయి పెరుగుతుందన్నారు. విత్తనాలను ప్రభుత్వం విడుదల చేస్తుందంటేనే పరీక్షలు నిర్వహించిన తదుపరి రైతులకు అందజేస్తున్నదన్న విషయాన్ని గుర్తించాలన్నా రు.

జన్యు మార్పిడి విధానం అణుశక్తి లాంటిదని, సానుకూల ఫలితాలు వచ్చేవిధంగా వినియోగించుకుంటే వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. ప్రస్తుతం విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని, జీవ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మేలు జరుగుతుందని తెలిపా రు. ప్రభుత్వాల పాలసీలు కూడా ఈ విధంగా ఉండాలని, రైతులు సహకరించాల్సిన అవస రం ఉందన్నారు.

ప్రపంచంలో 28 దేశాలలో 17 మిలియన్ల రైతులు 400 మిలియన్ల ఎకరాల్లో జన్యు మార్పిడి పంటలను పండిస్తున్నారని వివరించారు. జన్యు మార్పిడి పంటల వలన ఆరోగ్యకరమైన ఆహారం లభించి మనిషి ఆయుప్రమాణం పెరుగుతుందన్నారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధన సంస్థ ప్రతినిధి పి.ఆనంద్‌కుమార్, ప్రిన్సిపల్ సైంటిస్టు చుక్కారెడ్డి, ఎన్‌ఐఎం డెరైక్టర్ దినేష్‌కుమార్, సీనియర్ శాస్త్రవేత్త జలపతిరావు, జేడీఏ రామారావు, కృష్ణారావు, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement