కరీంనగర్‌ పొన్నంకే.. | Congress Mp Ticket For Ponnam | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌ పొన్నంకే..

Mar 16 2019 11:32 AM | Updated on Mar 16 2019 11:34 AM

Congress Mp Ticket For Ponnam - Sakshi

పొన్నం ప్రభాకర్‌, ఏ.చంద్రశేఖర్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అందరూ ఊహించినట్టుగానే కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ఎంపీ, బీసీ వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌కే కరీంనగ ర్‌ ఎంపీ స్థానాన్ని ఖరారు చేసింది. అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాజీమంత్రి, వికారాబాద్‌కు చెందిన ఏ.చంద్రశేఖర్‌కు పెద్దపల్లి సీటును కేటాయించింది. కరీంనగర్‌ సీటు పొన్నంకే ఖాయమని స్పష్టమైన సంకేతాలు ఉన్నా.. పెద్దపల్లి విషయంలోనే రెండురోజుల్లో మార్పులు జరిగాయి. పెద్దపల్లి నుంచి టికెట్‌ ఆశించిన స్థానిక నేతలు కవ్వంపల్లి సత్యనారాయణ, గోమాస శ్రీనివాస్, ఆరెపల్లి మోహన్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కాదని మాదిగ సామాజికవర్గానికి చెందిన ఏ.చంద్రశేఖర్‌కు కేటాయించారు. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీఎంపీ వివేక్‌కు మరోసారి అవకాశం ఇస్తారని భావిస్తున్న తరుణంలో స్థానికేతరుడైన చంద్రశేఖర్‌ ప్రభావం ఎలా ఉంటుందోనని అంశం ఆసక్తికరంగా మారింది. అయితే వివేక్, ఆయన తండ్రి, కేంద్రమాజీ మంత్రి వెంకటస్వామి కూడా హైదరాబాద్‌ ప్రాంతానికి చెందినవారే కావడం గమనార్హం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement