
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కబురు రావడంతో 4 రోజుల క్రితం రోహిత్‌రెడ్డి ఆయనను కలసినట్లు తెలిసింది. అయితే ప్రాదేశిక ఎన్నికల అనంతరం పార్టీలో చేరుతానని రోహిత్‌రెడ్డి కేటీఆర్‌కు చెప్పినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే రోహిత్ కాంగ్రెస్‌ను వీడి సొంత గూటికి చేరనున్నారు. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు.