breaking news
joing trs
-
టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి?
తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పైలట్ రోహిత్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కబురు రావడంతో 4 రోజుల క్రితం రోహిత్‌రెడ్డి ఆయనను కలసినట్లు తెలిసింది. అయితే ప్రాదేశిక ఎన్నికల అనంతరం పార్టీలో చేరుతానని రోహిత్‌రెడ్డి కేటీఆర్‌కు చెప్పినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. అన్నీ కుదిరితే త్వరలోనే రోహిత్ కాంగ్రెస్‌ను వీడి సొంత గూటికి చేరనున్నారు. ఏడాది క్రితం గులాబీ పార్టీ నుంచి బహిష్కణకు గురైన ఆయన అనంతరం కాంగ్రెస్‌లో చేరి తాండూరు ఎమ్మెల్యేగా గెలిచారు. -
ఆ ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
టీఆర్ఎస్ లో చేరికపై వివరణ ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్: ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన ఐదుగురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి గురువారం నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని టీడీపీ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా స్పీకర్ ఈ నోటీసులు జారీచేశారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజేందర్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, వివేకానందరెడ్డి, సాయన్నలను ఈ నోటీసులపై వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. టీఆర్ఎస్ లో ఇటీవల ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు చేరగా.. అంతకుముందు మరో ఐదుగురు చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ టీడీపీ తరఫున మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. అందులో పదిమంది టీఆర్ఎస్ గూటికి చేరారు. ఈ నేపథ్యంలో తమ పదిమందిని టీడీపీ శాసనసభాపక్షంగా భావిస్తూ.. తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ స్పీకర్ కు పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్ పై విచారణ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో టీడీపీ పిటిషన్ పై స్పీకర్ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేయడం గమనార్హం.