ఇందిరమ్మ రాజ్యం వస్తుంది | Congress Leader Komat Reddy Venkat Reddy Campaign In Nalgonda | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ రాజ్యం వస్తుంది

Nov 10 2018 9:06 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Leader Komat Reddy Venkat Reddy Campaign In Nalgonda - Sakshi

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి,నల్లగొండ టౌన్‌ : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గడపగడపకూ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నల్లగొండ పట్టణంలోని 15వ వార్డులో గల సతీష్‌నగర్, క్రాంతినగర్, గొల్లగూడ ప్రాంతాల్లో పర్యటించారు. ఓటర్లను పలకరిస్తూ తనకు ఓటేసి గెలిపిం చా లని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధి కారంలోకి రావడం ఖాయమని, జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నిం టినీ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన నిధులతోనే  మున్సిపాటీల్లో  అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. కేటీఆర్‌ మున్సిపల్‌ మంత్రిగా ఉన్నప్పటికి పైసా నిధులను ఇవ్వడంలేదని విమర్శించారు.

ఎక్కడ కూడా అభివృద్ధి జరగడం లేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యమై గ్రామాలన్నీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయన్నారు.  కాంగ్రెస్‌ హయాంలో 40శాతం ప్రాజెక్టులు పూర్తి చేశామని నాపై ఉన్న కోపంతో సీఎం కేసీఆర్‌ ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, బి.వెల్లంల ప్రాజెక్టు పనులను పూర్తి చేయలేదన్నారు. ఇంది రమ్మ రాజ్యంలోనే అన్నివర్గాలకు న్యాయం జరుగుతుం దన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిం చాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి  లక్ష్మీశ్రీనివాస్, కౌన్సిలర్‌ అల్లి నర్సమ్మ, కేసాని కవతి, మందడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అల్లి సుభాష్, వేణు, కంచి మధు, జూలకంటి శ్రీనివాస్, చింతమల్ల వెంకటయ్య శంకర్, షమీ, సతీష్, వంశీ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement