ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిపక్ష నేతలు

Congress And TDP Leaders Visits Kondagattu Accident Area - Sakshi

జగిత్యాల జిల్లా: కొండగట్టు రోడ్డులో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కాంగ్రెస్‌, టీడీపీ నేతల బృందం బుధవారం సందర్శించి పరిశీలించింది.  అనంతరం మృతుల కుటుంబాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, పెద్దిరెడ్డి, వి. హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌లు పరామర్శించారు. బస్సు ప్రమాదాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాలని ఈ సందర్భంగా నాయకులు వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

ప్రమాదానికి బాధ్యులైన మంత్రి పట్నం మహేందర్‌ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణలను మంత్రివర్గం నుంచి భర్తరఫ్‌ చేయాలని కోరారు. ప్రభుత్వంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని..లేదంటే ఆర్టీసీ అన్ని డిపోల ముందు ఆందోళనకు దిగి ఆర్టీసీని స్థంభింపజేస్తామని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు హెచ్చరించారు. కొండగట్టు ఘటన దురదృష్టకరమని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు ప్రభుత్వమే చికిత్స చేయిస్తుందని, దీనికి కారకులైన వారిపై చర్య తీసుకుంటామని తెలిపారు.

అసలే విషాదం.. ఆపై వర్షం
కొండగట్టు ప్రమాదంలో మృతిచెందిన వారి అంత్యక్రియలకు వర్షం వల్ల అంతరాయం కలిగింది. శనివారం పేట, హిమ్మత్‌ రావు పేట, తిర్మలాపూర్‌, రామ్‌సాగర్‌, డబ్బూతిమ్మాయిపల్లిలో వర్షం జోరుగా పడుతోంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top