కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
మాజీ ఎమ్మెల్యే పార్టీ మారడాన్నినిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
Oct 31 2014 7:54 PM | Updated on Apr 3 2019 8:52 PM
కేసముద్రం: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత టీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వరంగల్ జిల్లా కేసముద్రం స్టేషన్ కు చెందిన ఖాసీం అనే కాంగ్రెస్ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
బాధితుడి పరిస్థితి విషమంగా మారడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇటీవల డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పరిగి ఎమ్మెల్యే యాదయ్య, మాజీ ఎమ్మెల్యే కవితలు టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement