జిల్లా పోలీసుల పనితీరు భేష్! | Concluded the performance of the police! | Sakshi
Sakshi News home page

జిల్లా పోలీసుల పనితీరు భేష్!

Apr 13 2014 3:44 AM | Updated on Oct 8 2018 5:04 PM

జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు వల్లే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ, ఎన్నికల పరిశీలకులు ఎస్‌ఆర్ ఓజా ప్రశంసించా రు.

మహబూబ్‌నగర్ క్రైం, న్యూస్‌లైన్: జిల్లా పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు వల్లే ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడిందని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అదనపు డీజీపీ, ఎన్నికల పరిశీలకులు ఎస్‌ఆర్ ఓజా ప్రశంసించా రు. శనివారం ఆయన జిల్లా పోలీసు కార్యాల యాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయ న జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌తో సమావేశ మై, ఎన్నికల పర్యవేక్షణపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రాదేశిక ఎన్నికల్లో జిల్లాలో 80శాతం పోలింగ్ కావడంలో పోలీసులు పాత్ర ప్రశంసనీయమన్నారు.
 
 అనంతరం ఆయన కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన ఎన్నికల పోలీసు కంట్రోల్ రూంను సందర్శించారు. ఎన్నికల సందర్భంగా వస్తున్న ఫిర్యాదులను అడిగి తెలుసుకున్నారు. డయల్ 100 నంబర్‌కు వస్తున్న ఫిర్యాదులను, కంప్యూటర్‌లో రికార్డుల్లో నమోదును పరిశీలించారు. డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించిన కేసుల నమోదు వివరాలు అడిగారు. పోలీసులకు అందిన ఫిర్యాదులను ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లయింగ్ స్క్వాడ్‌కు క చ్చితంగా చేర వేయాలని సూచించారు. దీంతో పనిలో వేగవంతం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎన్నికల వింగ్ అధికారి రామ్మూర్తి, పీఆర్‌ఓ రంగినేని మన్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రతి ఫిర్యాదును పరిశీలించాలి
 కలెక్టరేట్: కలె క్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను ఓజా తనిఖీ చేశారు. ప్రతిష్టాత్మకంగా నిర్విహ స్తున్న ఎన్నికల పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దన్నారు. వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించాలన్నారు. ఎవరికి కేటాంచిన విధులను వారు పకడ్బందీగా చేపట్టేందుకు కృషి చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఈసీ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. కొడంగల్ టీడీపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డికి సంబంధించి నమోదు చేసిన ఫిర్యాదును ఆయన పరిశీలించారు.
 
 బరిలో ఉండే అభ్యర్థులు ప్రచారంలో ఎక్కడైనా నిబంధనలకు ఉల్లంఘిస్తున్నారని ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని ఆదేశించారు. కంట్రోల్ రూంకు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నామని ఈ సందర్భంగా  కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్, జే సీ శర్మన్‌లు ఆయనకు వివరించారు.  సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తున్నామని, ప్రస్తుతం పెండింగ్‌లో ఎలాంటి సమస్యలు లేవన్నారు. కార్యక్రమంలో కంట్రోల్ రూం ఇన్‌చార్జి రమణాచారి, సూపరింటెండెంట్ చంద్రకాంత్ రెడ్డి, సీ-సెక్షన్ తహశీల్దార్ చందర్‌రావు, ఏఓ కృష్ణకుమార్ పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement