
'బీజేపీ వచ్చాక మతోన్మాదం పెరిగింది'
బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాదం పెరిగిందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి విమర్శించారు. సుప్రీంకోర్టు మందలించే వరకు నల్లకుబేరుల జాబితా ఇవ్వకపోవడం కార్పొరేట్ శక్తులకు సహకరించడమేనని ఆరోపించారు.
వామపక్షాల ఐక్యత కోసం వచ్చే నెలలో ఢిల్లీలో ఐక్యతా సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని సుధాకరరెడ్డి చెప్పారు.