‘నాయనమ్మ’కు చేయూత | Collector Sharath who responded to the Sakshi story | Sakshi
Sakshi News home page

‘నాయనమ్మ’కు చేయూత

Feb 20 2020 2:47 AM | Updated on Feb 20 2020 3:02 PM

Collector Sharath who responded to the Sakshi story

గంగవ్వ కుటుంబంతో మాట్లాడుతున్న కలెక్టర్‌

సాక్షి, కామారెడ్డి: తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను పెంచేందుకు ఆ నాయనమ్మ పడుతున్న కష్టాలపై కలెక్టర్‌ శరత్‌ స్పందించారు. కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈనెల 15న ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో ‘ముగ్గురు పిల్లలు.. నాయనమ్మ’ కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఇది చదివిన కలెక్టర్‌.. భిక్షాటన చేస్తూ పిల్లలను పెంచుతున్న నాయనమ్మ గంగవ్వ కష్టాలను తెలుసుకుని చలించిపోయారు. అధికారులతో వివరాలు సేకరించారు. బు ధవారం సాయంత్రం కామారెడ్డి జిల్లా కుప్రియాల్‌ నుంచి గంగవ్వతో పాటు ఆమె మనవరాళ్లు చామంతి, వసంత, మనవడు శ్రీకాంత్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. (గంగవ్వను కదిలిస్తే కన్నీళ్లే..)

కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇకపై భిక్షాటన చేయవద్దని గంగవ్వకు సూచించారు. తక్షణ సహాయంగా రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పెద్దమ్మా యి చామంతికి ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. 9వ తర గతి చదువుతున్న వసంతను కేజీబీవీలో చేర్పించాలని, టెన్త్‌ చదువుతున్న శ్రీకాంత్‌ను వచ్చే సంవత్సరం గురుకుల కళాశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పూరిగుడిసెలో నివసిస్తున్న గంగవ్వకు డబు ల్‌ బెడ్‌రూం ఇల్లు కేటాయిస్తామన్నారు. కలెక్టర్‌ భరోసా ఇవ్వడంతో గంగవ్వ ఆ మె మనువడు, మనువరాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదుకున్న కలెక్టర్‌కు, తమ కష్టాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి రుణపడి ఉంటామని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement