‘రామప్ప’ అభివృద్ధికి సహకరించండి 

Collaborate with the development of the Ramappa Temple - Sakshi

కేంద్ర పర్యాటక మంత్రిని కోరిన  ఎంపీ సీతారాంనాయక్, టీఎస్‌టీడీసీ చైర్మన్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి ఆల్ఫోన్స్‌ను ఎంపీ సీతారాం నాయక్, తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డి కోరారు. సోమవారం ఢిల్లీలో వారు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. అనంతరం భూపతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన ‘ప్రసాద్‌’పథకంలో రామప్ప ఆలయం, రామప్ప చెరువును కూడా చేర్చాలని కేంద్రమంత్రిని కోరినట్టు తెలిపారు. స్వదేశీదర్శన్‌ పథకంలో ట్రైబల్‌ సర్క్యూట్‌లో రామప్పను చేర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.

సందర్శకులతో కళకళలాడుతున్న రామప్ప చెరువులో విహారానికి రెండు హౌజ్‌ బోట్‌లను మంజూరు చేయాలని విన్నవించారు. రామప్ప ఆలయాన్ని హెరిటేజ్‌ మాన్యుమెంట్‌గా గుర్తించాలని, ట్రైబల్‌ సర్క్యూట్‌లో ములుగు, లక్నవరం, తాడ్వాయి మేడారం, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం మాత్రమే ఉన్నాయని, ఈ పథకంలో రామప్పను చేర్చితే రామప్ప ఆలయం అభివృద్ధి చెందుతుందని సూచించారు. తెలంగాణ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అని, దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కేంద్రమంత్రికి విన్నవించార 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top