బొగ్గు బండి

Coal transport transport from singareni in record level

సింగరేణి నుంచి రికార్డు స్థాయిలో వ్యాగన్ల ద్వారా బొగ్గు రవాణా

వరంగల్‌ నుంచి తాండ్ర కృష్ణగోవింద్‌: బొగ్గుతో నడిచే ఆరివి ఇంజన్‌తో ప్రారంభమైన రైల్వే వ్యవస్థ నేడు బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం వందలాది టన్నుల్లో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సింగరేణి బొగ్గును రైళ్లద్వారా తరలిస్తున్నారు. గోదావరి – ప్రాణహిత పరీవాహక ప్రాంతాల్లో సింగరేణి సంస్థ ఆరు జిల్లాల పరిధిలోని కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భూపాలపల్లి, రామగుండం 1, 2, 3, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, అడ్రియాల ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తి జరుపుతోంది. సింగరేణి బొగ్గు.. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు, సిమెంటు పరిశ్రమలకు ఎక్కువగా సరఫరా అవుతోంది. రైలు, రోడ్డు మార్గాల ద్వారా బొగ్గును పారిశ్రామిక అవసరాలకు తరలిస్తున్నారు.

బొగ్గు రవాణా వల్లే రైలు మార్గాలు..
బ్రిటిష్‌ కాలంలో కేవలం బొగ్గు రవాణాను దృష్టిలో ఉంచుకునే ఇల్లందు, కొత్తగూడెం – మణుగూరు వంటి ప్రాంతాలకు రైలుమార్గం నిర్మించారు. చెన్నై – న్యూఢిల్లీ గ్రాండ్‌ట్రంక్‌ మార్గంలో రామగుండం, బెల్లంపల్లి, మందమ ర్రి వంటి ప్రాంతాలు ఉన్నాయి. దీంతో ఒక్క భూపాలపల్లి ఏరియాను మినహాయిస్తే మిగి లిన సింగరేణి ఏరియాలు రైలు మార్గంతో అనుసంధానమై ఉన్నాయి. దీంతో రైలుమార్గం ద్వారా భారీగా బొగ్గు రవాణా జరుగుతోంది.

రైలు వ్యాగన్ల ద్వారా రవాణా అవుతున్న బొగ్గులో 90% ఎన్టీపీసీ (రామగుండం, సింహా ద్రి), కేటీపీఎస్‌ (కొత్తగూడెం), జైపూర్, వీటీపీ ఎస్‌ (విజయవాడ), ఎస్‌డీఎస్‌టీ (నెల్లూరు), ఆర్‌టీపీసీ (కడప)లలో ఉన్న విద్యుత్‌ కేంద్రాలకు సరఫరా అవుతోంది.

పెరిగిన ఉత్పత్తి
80వ దశకం వరకు భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి జరిగేది. ఆ తర్వాత ఓపెన్‌కాస్ట్‌ గనుల ద్వారా ఉత్పత్తి ప్రారం భమైంది. ఉపరితల గనుల్లో యంత్రాలు వినియోగించడం వల్ల వ్యయం తక్కువ. దీంతో ఏకంగా అడ్రియాల ఓపెన్‌ కాస్టు పేరుతో ఒక ఏరియా ఏర్పాటు చేశారు. ఓపెన్‌కాస్టులు, యాంత్రీకరణ ఫలితంగా క్రమంగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోంది. 1990లో 1.20 లక్షల మంది కార్మికులు సాలీనా 20 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ప్రస్తుతం 56 వేల మంది కార్మికులు 61 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇందులో అధిక భాగం రైలు మార్గం ద్వారానే రవాణా చేస్తున్నారు.

74,54,622
సింగరేణి నుంచి 2016–17లో ఇప్పటి వరకు వ్యాగన్ల
ద్వారా రవాణా అయిన బొగ్గు (టన్నుల్లో) మొత్తం

2016–17లో సింగరేణి నుంచి  
ఏరియాల వారీగా రైలు వ్యాగన్ల ద్వారా రవాణా
అయిన బొగ్గు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top