సీఎం కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీర్‌: కర్నె | CM KCR Social engineer | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీర్‌: కర్నె

Aug 13 2017 1:58 AM | Updated on Aug 15 2018 9:37 PM

సీఎం కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీర్‌: కర్నె - Sakshi

సీఎం కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీర్‌: కర్నె

సీఎం కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీర్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ పోచంపాడు

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ సోషల్‌ ఇంజనీర్‌ అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. శనివారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ పోచంపాడు బహిరంగ సభకు భారీగా వచ్చిన ప్రజలను చూసి కాంగ్రెస్‌ నేతలు భయంతో ఇష్టమొచ్చి నట్టు మాట్లాడుతున్నారన్నారు.

కేసీఆర్‌ ఇంజ నీర్‌లా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, ప్రాజెక్టుల రీడిజైన్‌కోసం ఇంజనీరుగానే పనిచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు.కేసీఆర్‌కు తెలంగాణలో ప్రతీ అంశంపై సమగ్ర అవగాహన ఉందన్నారు. దక్షిణ తెలంగాణపై కాంగ్రెస్‌ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, ఫ్లోరోసిస్‌ పీడిత నల్లగొండ జిల్లాకు నీళ్లివ్వడం పాలమూరు కాంగ్రెస్‌ నేతలకు ఇష్టం లేదా అని ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement