కేసీఆర్ పిట్టలదొర మాటలు మానాలి: ఎర్రబెల్లి | cm kcr should consentrate on welfare schemes say errabelli dayakar rao | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పిట్టలదొర మాటలు మానాలి: ఎర్రబెల్లి

Jun 30 2015 7:44 PM | Updated on Aug 15 2018 9:27 PM

సీఎం కేసీఆర్ పిట్టల దొర మాటలు మాని.. సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయూలని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

వరంగల్: సీఎం కేసీఆర్ పిట్టల దొర మాటలు మాని.. సంక్షేమ పథకాల అమలు కోసం కృషి చేయూలని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా తొర్రూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, రైతులు, కార్మికులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. బడా సంస్థల ప్రయోజనాల కోసమే ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. అందులో భాగంగానే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుమ్మకై చిన్నచిన్న ఇంజనీరింగ్ కాలేజీలను మూసివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అనేక హామీలు ఇచ్చి వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. ఇప్పటికైనా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం మానుకోవాలని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement