యువ కళాకారుడి దేశభక్తి     | Clay statue Of Bharatha Matha | Sakshi
Sakshi News home page

యువ కళాకారుడి దేశభక్తి    

Aug 16 2018 12:56 PM | Updated on Aug 16 2018 2:15 PM

Clay statue Of Bharatha Matha - Sakshi

  తాను తయారు చేసిన విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న భీమేశ్‌  

నిర్మల్‌ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భరతమాతకు ఓ యువకుడు వినూత్నంగా నివాళులర్పించారు. తనలోని దేశభక్తిని రంగరించి మట్టిముద్దతో దేశమాతకు రూపునిచ్చాడు. నిర్మల్‌రూరల్‌ మండలంలోని అనంతపేట్‌కు చెందిన యువకవి, కళాకారుడు పోలీస్‌ భీమేశ్‌ బుధవారం 72న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  72 సెంటీమీటర్ల భరతమాత విగ్రహాన్ని మట్టితో తయారుచేశాడు. దేశమాతకు వినూత్నంగా నివాళులర్పించాలన్న తపనకు తన కళను జోడించి ఇలా విగ్రహాన్ని రూపొందించినట్లు భీమేశ్‌ తెలిపారు. విగ్రహాన్ని తయారు చేసిన యువకుడిని గ్రామస్తులు, పలువురు కవులు, కళాకారులు అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement