రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు.
కుత్బుల్లాపూర్: రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఓ యువకుడికి స్నేహితులే నిప్పంటించారు. ముగ్గురు స్నేహితులు రాకేశ్, బాబర్, ఆనంద్లు శనివారం రాత్రి ఘర్షణ పడ్డారు. గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వారిని మందలించి పంపించేశారు. మళ్లీ గంట తర్వాత ముగ్గురు ఒకే చోట చేరుకోగా, ఆనంద్(25) పై మిగిలిన వారు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. నిందితుడు బాబర్ను పోలీసులలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో నిందితుడు రాకేశ్ పరారీలో ఉన్నాడు.