సచివాలయానికి సీఐ పదోన్నతుల రగడ | Sakshi
Sakshi News home page

సచివాలయానికి సీఐ పదోన్నతుల రగడ

Published Sun, Aug 20 2017 3:04 AM

cis demands for promotions

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో తమకు పదోన్నతుల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, బంగారు తెలంగాణలోనైనా న్యాయం జరుగుతుందని ఆశ పడ్డ తమకు నిరాశే ఎదురవుతోందని 1989–91 బ్యాచ్‌ సీఐ (సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు)లు వాపోయారు. శనివారం సచివాలయానికి ఆ బ్యాచ్‌ సీఐలు మూకుమ్మడిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఐదో జోన్‌లో డీఎస్పీలుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు.

పదోన్నతుల ఫైలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వద్ద ఉండటంతో సాయంత్రం వరకు అక్కడే వేచిచూశారు. అనంతరం సీఐలతో హోంమంత్రి, రాజీవ్‌ త్రివేది, రాజీవ్‌ శర్మలు రాత్రి 7 గంటల వరకు చర్చలు జరిపారు. ఈ నెల 31లోపు ప్రమోషన్ల విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు ఎలాంటి ఆలోచనలు చేయొద్దని వారు సూచించారు. దీని వల్ల ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు వస్తాయని సీఐలకు హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement