
నందీశ్వరుడిని దర్శించుకుంటున్న సుబ్బరామిరెడ్డి
హన్మకొండ కల్చరల్: కాకతీయుల కాలం నాటి కళా వైభవాన్ని చాటిచెప్పే విధంగా మార్చి 11న వరంగల్ కోటలో ‘కాకతీయ కళోత్సవం’ నిర్వహించ నున్నట్లు రాజ్యసభ సభ్యుడు, సినీ నిర్మాత డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని ఎమ్మెల్యే దయాకర్‌రావుతో కలసి ఆయన సందర్శించారు.
ఈ ఆలయాన్ని రక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్ హీరోలఠిుగా తాను త్వరలో కొత్త చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. వారిద్దరి కాంబినేషన్‌లో తీసే సినిమాకు కథ కూడా సిద్ధమైందన్నారు.