బిడ్డా.. సర్కారుకు లొంగిపో... | Sakshi
Sakshi News home page

బిడ్డా.. సర్కారుకు లొంగిపో...

Published Sun, Feb 8 2015 6:43 AM

Child .. surrendering to civil ...

  • మావోయిస్టు అగ్రనేత సుదర్శన్ తల్లిదండ్రుల వేడుకోలు
  • బెల్లంపల్లి: ‘కాళ్లు, చేతులుడిగి కాటికి దగ్గరైనం.. కళ్లు గనిపిత్తలే వ్.. సర్కారుకు లొంగిపోయి ఇం టికి రా బిడ్డా’ అని ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన కటకం వెంకటమ్మ, మల్లయ్య దంపతులు వేడుకున్నారు. వీరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ తల్లిదండ్రులు. వీరిని శనివారం బెల్లంపల్లి డీఎస్పీ ఎ. రమణారెడ్డి కలుసుకొని దుస్తులు అందజేశారు.

    ఈ సందర్భంగా సుదర్శన్ తండ్రి మల్లయ్య మాట్లాడుతూ..  నలభై ఏళ్ల క్రితం ఇల్లు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కొడుకు ఇప్పటికైనా ఇంటికి రావాలని విజ్ఞప్తి చేశారు. కన్నుమూసేలోగా కొడుకును చూడాలని ఉందని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి లొంగిపోతే సుదర్శన్ పేరు మీద ఉన్న రివార్డును పూర్తిగా అందజేస్తామని హామీ ఇచ్చారు. జీవనోపాధి కోసం పునరావాసం కల్పిస్తామన్నారు. కేసులు కూడా పెట్టబోమన్నారు. డీఎస్పీ వెంట వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎ.సత్యనారాయణ, అదనపు ఎస్సై ఎన్.సుధాకర్ ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement