
సమ్‌థింగ్ స్పెషల్
చిలకలు వాలిన చెట్టు ఎంత అద్భుతం! అయితే ఇప్పుడు ఆ అద్భుతాలు అరుదైపోయాయి. ఈ నేపథ్యంలో ‘చిలకలను కా పాడుకుందాం’ అంటున్నారు సుదర్శన్, విద్య దంపతులు. చెన్నైలోని చింతాద్రిపేటలో ఉండే ఈ దంపతుల ఇంటి టెర్రస్‌పై రోజూ చిలకలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి. రోజు ఎన్నో చిలకలకు సుదర్శన్, విద్య దంపతులు ఆహారం సమకూరుస్తున్నారు.
ఇందుకోసం వారు తెల్లవారు జామున నాలుగు గంటలకు నిద్రలేస్తారు. చిలకలకు రోజూ ఆహారం ఇవ్వడం ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. చిలకలపై ఈ దంపతులకు ఉన్న ప్రేమను హైలెట్ చేస్తూ ఒక తమిళ సినిమాలో సీన్ క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో కూడా వీరి గురించి కథనాలు రావడంతో, చిలకల ఇంటిని చూడడానికి దేశవిదేశాల నుంచి సందర్శకులు వస్తుంటారు.