చికెన్ ధరలు తగ్గెన్ | Chicken prices fall in telangana | Sakshi
Sakshi News home page

చికెన్ ధరలు తగ్గెన్

Jul 3 2015 8:15 AM | Updated on Sep 3 2017 4:49 AM

చికెన్ ధరలు తగ్గెన్

చికెన్ ధరలు తగ్గెన్

నిన్న మొన్నటి వరకూ చుక్కలు చూపించిన చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో పోలిస్తే చికెన్ ధరల్లో తగ్గుదల గణనీయంగా ఉంది.

హైదరాబాద్ : నిన్న మొన్నటి వరకూ చుక్కలు చూపించిన  చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. గత నెలలో పోలిస్తే చికెన్ ధరల్లో తగ్గుదల గణనీయంగా ఉంది. గడిచిన పన్నెండు రోజుల్లోనే కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.40 మేర తగ్గింది.

గత నెల 20న స్కిన్ లెస్ చికెన్ దర కిలో రూ.192 ఉండగా, 25వ తేదీ నాటికి రూ.174 చేరింది. 27వ తేదీన రూ.166 ఉండగా, నెలాఖరు నాటికి మరో 6 రూపాయలు తగ్గి రూ.160కి చేరింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ రూ.152కి అందుబాటులోకి వచ్చింది.

 

Advertisement
 
Advertisement
Advertisement