ఆలేరు ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు నమోదు | cheating case on MLA | Sakshi
Sakshi News home page

ఆలేరు ఎమ్మెల్యేపై చీటింగ్ కేసు నమోదు

Mar 31 2014 1:29 AM | Updated on Sep 2 2017 5:22 AM

మోసం కేసుకు సంబంధించి నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌పై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్లో ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

సాక్షి, హైదరాబాద్: మోసం కేసుకు సంబంధించి నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌పై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పరిధిలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్లో ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదైంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మారుస్తానంటూ తనవద్ద రూ.20 లక్షలు లంచం తీసుకున్నారని, వేధింపులకు గురిచేశారని పేర్కొంటూ బాధితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వి.పూర్ణచందర్‌రావు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఎమ్మెల్యేపై చర్యలకు ఆదేశించింది. బాధితుడు పూర్ణచందర్‌రావు ఆదివారం ఆయా వివరాలను మీడియాకు వివరించారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement