‘ఆయనకు పేదలు కనిపించరు’

Chandrababu Destroyed All Systems In AP YSRCP Leader Parthasarathy - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడాబాబులకే అండగా ఉంటారని, ఆయనకు పేదలు కనిపించరని వైఎస్సార్‌సీపీ నేత పార్ధసారధి విమర్శించారు.  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని గురువారం ఉద్యోగులు చేపట్టిన ఆమరణ దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఏపీలో ఉన్న వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని మండిపడ్డారు. నమ్మినవారికి అన్యాయం చేయటమే చంద్రబాబు పని అని అన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు.  జగన్‌మోహన్‌ రెడ్డి ఓట్ల కోసం పనిచేసే నాయకుడు కాదని, పేదలు, కష్టాల్లో ఉన్నవారి కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటుందని అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top