కోరిక తీర్చనందుకే హతమార్చాడు | chandra sekhar attempt murder to degree student | Sakshi
Sakshi News home page

కోరిక తీర్చనందుకే హతమార్చాడు

Mar 15 2014 3:24 AM | Updated on Sep 2 2017 4:42 AM

తన కోరిక తీర్చలేదనే కోపంతో డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) ని వరుసకు సోదరుడైన చంద్రశేఖర్ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడని వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్ : తన కోరిక తీర్చలేదనే కోపంతో డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) ని వరుసకు సోదరుడైన చంద్రశేఖర్ గొడ్డలితో దాడి చేసి హతమార్చాడని వనపర్తి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసు వివరాలను శుక్రవారం కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో ఆయన తెలిపారు. మండలంలోని రామనంతాపురానికి చెందిన చంద్రశేఖర్ వడ్డెర వృత్తిని కొనసాగిస్తూ వివిధ ప్రాంతాలు తిరిగేవాడు. అప్పుడప్పుడూ స్వగ్రామానికి వచ్చేవాడు. పలుసార్లు అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి సోదరులు, తల్లిదండ్రులు మందలించా రు. ఈ క్రమంలోనే గురువారం మధ్యాహ్నం ఆ యువతి సమీపంలోని తమ పొలానికి వెళుతుండగా వెంబడించి కోరిక తీర్చాలని పట్టుబట్టాడు.
 
 నిరాకరించిన ఆమెపై గొడ్డలితో దాడి చేసి చంపేశాడు. బాధిత కుటుం బ సభ్యుల ఫిర్యాదు మేరకు అతడిని పోలీ సులు అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం వనపర్తి కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్‌ఐ మురళీగౌడ్ పాల్గొన్నారు.
 
 విద్యార్థిని మృతదేహానికి పోస్టుమార్టం
 కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్ : మండలంలోని రామనంతాపురంలో దారుణ హత్య కు గురైన డిగ్రీ విద్యార్థిని లక్ష్మీదేవి (19) మృతదేహానికి శుక్రవారం వనపర్తి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసుల బందోబస్తుతో స్వ గ్రామానికి తరలించారు. మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు ఆగ్రహా వేశాలకు లోనై నిందితుడి ఇంటిపై దాడికి యత్నించారు. ఒక దశలో అతని ఇంటి ఎదుటే పూడ్చాలని పట్టుపట్టారు. వారికి కొత్తకోట సీఐ రమేష్‌బాబు, పెద్దమందడి ఎస్‌ఐ మురళీగౌడ్ నచ్చజెప్పి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్  ఏర్పాటు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement