రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లిన ఘటన నగరంలోని వనస్థలిపురంలో సోమవారం చోటుచేసుకుంది.
వనస్థలిపురం (హైదరాబాద్) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు గొలుసు లాక్కెళ్లిన ఘటన నగరంలోని వనస్థలిపురంలో సోమవారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన రాధిక నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్ వచ్చిన దుండగులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు.