కల్లు తాగించి.. గొలుసు ఎత్తుకెళ్లారు! | chain robbery in toddy depot | Sakshi
Sakshi News home page

కల్లు తాగించి.. గొలుసు ఎత్తుకెళ్లారు!

Jun 25 2016 9:59 AM | Updated on Mar 28 2018 11:26 AM

కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ కల్లు తాగడం కోసం కల్లు కంపౌడ్‌కు వెళ్లింది.

రాజేంద్రనగర్: కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ కల్లు తాగడం కోసం కల్లు కంపౌడ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన ఇద్దరు మహిళలు ఆమెకు పూటుగా కల్లుతాగించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని ఓ కల్లు దుకాణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

శనివారం ఉదయం మత్తు నుంచి తేరుకున్న సదరు మహిళ పుస్తెలుతాడు మెడలో కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement