
సీబీఐ విచారణ జరపాలి
271 కోట్ల రూపాయల విలువైన పోలీసు వాహనాల కొనుగోలు కుం భకోణంపై సీబీఐ ఇచారణ జరపాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క
పోలీసు వాహనాల కొనుగోళ్లపై భట్టి విక్రమార్క
కేంద్రమంత్రి వెంకయ్యతో కేసీఆర్ కుమ్మక్కు
తలసాని నియామకం అప్రజాస్వామికం
రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: 271 కోట్ల రూపాయల విలువైన పోలీసు వాహనాల కొనుగోలు కుం భకోణంపై సీబీఐ ఇచారణ జరపాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో మం గళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ కోసం 3580 ఇన్నోవాలను, 2వేల మోటార్ బైక్‌లను టెండర్లు లేకుం డా కొనుగోలు చేయడంలో పెద్దెత్తున అవినీతి జరి గిందని ఆరోపించారు. కేంద్రమంత్రి వెంక య్య కుమారునికి చెందిన హర్ష టయోటా కంపెనీ నుంచి ఇన్నోవాలను టెండర్లు లేకుం డా తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ కుమారు డు, రాష్ట్రమంత్రి కేటీఆర్‌కు చెందిన హిమాంశు మోటార్ డీలర్స్ నుంచి 2వేల బైక్‌లను కొనుగోలు చేశారని చెప్పారు. అవినీతి రహితంగా, పారదర్శకంగా సుపరిపాలన చేస్తామని చెప్పుకుంటున్న సీఎం స్వయంగా వీటిలో అక్రమాలకు పాల్పడ్డారని భట్టి ఆరోపించారు.
సాంఘికసంక్షేమ హాస్టళ్లలో ట్రంకు పెట్టెలు కొనుగోలు చేయాలన్నా టెండర్లు పెట్టే వ్యవస్థ రాష్ట్రంలో ఉందన్నారు. వాహనాల కోసం ఇంత పెద్ద మొత్తం ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడుతున్నప్పుడు పారదర్శకంగా టెండర్లను నిర్వహించకపోవడం వెనుక వెంకయ్యనాయుడు, కేసీఆర్ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్టు అనుమానాలు వస్తున్నాయన్నారు. వాహనాలను కొనుగోలు చేయడం వెనుక భారీ స్కాం ఉందని ఆరోపించారు. కేంద్రమం త్రి వెంకయ్యనాయుడుతో టీఆర్‌ఎస్‌కు ఉన్న చీకటి సంబంధాలను వెల్లడి చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీనిపై సీబీఐ విచారణ జరపాలని భట్టి డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే విధంగా, అపహాస్యం చేస్తూ రాష్ట్ర మంత్రివర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కొనసాగించడం అప్రజాస్వామికమని మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. 2014 డిసెంబరులో మంత్రివర్గంలో తలసానిని చేర్చుకునే సమయంలో గవర్నరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన లేఖలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడని నివేదించినట్టుగా చెప్పారు. ఒకవేళ టీడీపీ సభ్యునిగా తలసాని కొనసాగుతూ ఉంటే టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో చేరడం రాజ్యాంగ వ్యతిరేకమే అని భట్టి అన్నారు. దీనిపై రాష్ట్రపతిని కలసి వివరిస్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతామని చెప్పారు.