వేధింపుల వైద్యాధికారిపై కేసు | case on Officer who was involved in the sexual assault | Sakshi
Sakshi News home page

వేధింపుల వైద్యాధికారిపై కేసు

Mar 15 2016 3:25 PM | Updated on Sep 3 2017 7:49 PM

కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నర్సులు, ఏఎన్‌ఎంలను లైంగికంగా వేధిస్తున్న సీనియర్ ప్రజా వైద్యాధికారి వసంతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న నర్సులు, ఏఎన్‌ఎంలను లైంగికంగా వేధిస్తున్న సీనియర్ ప్రజా వైద్యాధికారి వసంతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వసంతరావు లైంగిక వేధింపులపై పీహెచ్‌సీలో పనిచేస్తున్న హెడ్ నర్సులు, నర్సులు, ఏఎన్‌ఎంలు సుమారు 30 మంది సోమవారం కరీంనగర్‌లోని జిల్లా వైద్యాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం కూడా ఇచ్చారు. అదే రోజు రాత్రి చొప్పదండి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వసంతరావుపై సెక్షన్ 354/ఏ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement