‘కేన్సర్‌ మరణాల్లో 85 శాతం ఊపిరితిత్తులకు చెందినవే’

Cancer Patients Died With Lungs More Then 85Percent - Sakshi

జూబ్లీహిల్స్‌: ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కేన్సర్‌ సంబంధిత మరణాల్లో దాదాపు 85 శాతం ఉపిరితిత్తుల కేన్సర్‌కు చెందినవే ఉంటున్నాయని యశోదా ఆసుపత్రి మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ డాక్టర్‌ భరత్‌ వాస్వాని అన్నారు. 2018లో దేశంలో 67 వేలకు పైగా ఊపిరతిత్తుల కేన్సర్‌ను గుర్తించగా అందులో 40 శాతం మంది బాధితులకు అప్పటికే శరీరంలోని కాలేయం, మెదడు, ఎముకలు సహా ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉందని అన్నారు. ఈనేపథ్యంలో ‘టార్గెటెడ్‌ థెరపీ విత్‌ పర్సనైల్జ్‌ మెడిసిన్‌’ అనే సరికొత్త విధానంలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని ఆయన తెలిపారు.

తాజ్‌కృష్ణా హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ కేసులు ఉంటున్నాయని, గాలి కాలుష్యం, డిజిల్‌ పొగకు గురికావడంతో సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ఒకటి లేదా రెండు ఊపిరితిత్తుల్లో ఆసాధారణ కణాల వృద్ధి చెంది ఉపిరతిత్తుల కేన్సర్‌కు దారి తీస్తుందన్నారు. వేగంగా విభజన చెందే సాధారణ కాన్సర్‌ కణాల మీద పనిచేసే కెమోధెరపీతో పోలిస్తే టార్గెటెడ్‌ థెరపీలు కేన్సర్‌కు చెందిన నిర్ధిష్ట లక్ష్యాల మీద పనిచేస్తాయని తద్వారా బాధితుల జీవితకాలం పెంచడం, స్వస్థత రేటు పెంచే అవకాశం మరింతగా అందుబాటులోకి వచ్చిందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top