నిజాయితీ చాటుకున్న కండక్టర్‌ | bus conductor returned pouch | Sakshi
Sakshi News home page

నిజాయితీ చాటుకున్న కండక్టర్‌

Nov 20 2017 10:43 AM | Updated on Mar 28 2018 11:26 AM

bus conductor returned pouch - Sakshi

పర్సు అందజేస్తున్న కండక్టర్‌ మధు

మణికొండ: ఆర్టీసీ బస్సులో దొరికిన పర్సును తిరిగి పోగొట్టుకున్న వ్యక్తిని పిలిచి అందజేసి ఓ బస్‌ కండక్టర్‌ తన నిజాయితీని చాటుకున్నాడు. మణికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పంచవటి కాలనీలో నివసిస్తున్న మురళీమోహన్‌ శనివారం సొంత పనిపై నగరానికి వెళ్లివచ్చారు. కాగా అతను ప్రయాణించిన ఆర్టీసీ బస్సులో తన పర్సును పోగొట్టుకున్నాడు. లింగంపల్లి నుంచి ఉప్పల్‌కు సర్వీస్‌ అందించే 113 బస్‌లో కండక్టర్‌గా పని చేస్తున్న మధుకు పర్సు దొరికింది.

దీంతో పర్సు ఎవరిదో.. వారికి అందజేయాలనే ఉద్దేశ్యంతో అందులోని వివరాల ప్రకారం అతనికి ఫోన్‌ చేసి పర్సు తన వద్ద ఉందని, వచ్చి తీసుకోవాలని సూచించారు.  మురళీమోహన్‌తో పాటు కండక్టర్‌ మధు కూడా మణికొండలోనే నివసిస్తుండడంతో సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి సమక్షంలో మధు ఆయనకు పర్సును అప్పగించారు. అందులో రూ. 8వేల నగదుతో పాటు ఏటీఎం కార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, క్రెడిట్‌కార్డులు తదితర విలువైన కార్డులు ఉన్నాయని, నిజాయితీగా తన పర్సు తనకు అందించిన కండక్టర్‌ మధుకు మురళీమోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement