మంచి కండక్టర్‌! | Bus Conducter Good Behavior In Bodhan | Sakshi
Sakshi News home page

మంచి కండక్టర్‌!

Aug 19 2019 10:21 AM | Updated on Aug 19 2019 11:55 AM

Bus Conducter Good Behavior In Bodhan  - Sakshi

సాక్షి, బోధన్‌ : బస్సులో మరిచిపోయిన రూ.25 వేల క్యాష్‌ బ్యాగును కండక్టర్‌ తిరిగి ప్రయాణికుడికి ఇచ్చి మంచితనం చాటుకున్నాడు. బోధన్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ25వై.0018) శనివారం ఉదయం వరంగల్‌ వెళ్లి తిరిగి నిజామాబాద్‌ మీదుగా రాత్రి 8 గంటలకు బోధన్‌కు చేరుకుంది. బోధన్‌ పట్టణం ఆచన్‌పల్లి ప్రాంతానికి చెందిన నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ నీరడి గంగా శంకర్‌ నిజామాబాద్‌ బస్టాండ్‌లో బస్సు ఎక్కారు.

లెదర్‌ బ్యాగును బస్సులోనే  మరిచిపోయి బోధన్‌లో బస్సు దిగి వెళ్లిపోయాడు. గమనించిన కండక్టర్‌ రాజ్‌కుమార్‌ లెదర్‌బ్యాగును డిపో సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కు అప్పగించారు. బ్యాగును తెరిచి చూడగా అందులో రూ. 25 వేల నగదు, మెడిసిన్స్, మెడికల్‌ రిపోర్టులు ఉన్నాయి. దీంతో డీఎం రమణకు సమాచారం అందించారు. మంచితనం చాటుకున్న కండక్టర్‌ రాజ్‌కుమార్, డ్రైవర్‌రాజును డిపో అధికారులు అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement