బుల్లెట్‌ బాబు..70 చలాన్లు!

Bullet Bike Seized With 70 Pending Challans Hyderabad - Sakshi

ద్విచక్ర వాహనాన్నిసీజ్‌ చేసిన నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు

నల్లకుంట: నగరంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమణకు సంబంధించి 77 పెండింగ్‌ చలానాలు ఉన్న ఓ ద్విచక్ర వాహనం నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు చిక్కింది. వివరాల్లోకి వెళితే.. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా సోమవారం నల్లకుంట ట్రాఫిక్‌ పోలీసులు ఎస్సై రమేష్‌ నేతృత్వంలో ఫీవర్‌ ఆస్పత్రి చౌరస్తా సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో జుజ్జువారపు సువర్ణరాజు తన బుల్లెట్‌ (టీఎస్‌ 07ఎఫ్‌హెచ్‌ 1245) వాహనంపై శంకరమఠం నుంచి ఫీవర్‌ ఆస్పత్రి వైపు వెళ్తుండగా పోలీసులు ఆపారు.

తమ వద్ద ఉన్న ట్యాబ్‌లో ఆ బండి నెంబర్‌తో చెక్‌ చేయగా ఆ వాహనంపై మొత్తం 77 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ చలానాలకు సంబంధించి బకాయిలు రూ.12,725 ఉండటంతో ఎస్సై రమేష్‌ ద్విచక్రవానహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని సీఐ రాజేంద్ర కులకర్ణికి తెలియజేయడంతో ఆయన   నగర పోలీసు కమిషనరేట్‌కు సమాచారం ఇచ్చారు. పెండింగ్‌ చలానాలు క్లియర్‌ చేస్తే వాహనాన్ని అప్పగిస్తామని ఎస్సై చెప్పారు. కాగా .. పెండింగ్‌ చలానాల్లో ఎక్కువగా హెల్మెట్‌ లేకుండా వాహనం నడిపినందుకే ఉండటం గమనార్హం. ఇంతగా ట్రాఫిక్‌ వాయిలెన్స్‌కు పాల్పడిన  సదరు వాహనదారుడికి ఏమైనా శిక్ష విధిస్తారా, లేక లైసెన్స్‌ రద్దు చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top