కొత్తపల్లి ఆంధ్రాబ్యాంక్‌లో కత్తితో వీరంగం | brutal knife attack | Sakshi
Sakshi News home page

కొత్తపల్లి ఆంధ్రాబ్యాంక్‌లో కత్తితో వీరంగం

Mar 17 2015 8:07 PM | Updated on Jun 2 2018 5:51 PM

కత్తితో బ్యాంక్ లోపలికి ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణారహితంగా అటెండర్ పై దాడికి పాల్పడ్డాడు.

కరీంనగర్ : కత్తితో బ్యాంక్ లోపలికి ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణారహితంగా అటెండర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బ్యాంక్ అటెండర్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలోని ఆంధ్రాబ్యాంక్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి గ్రామ ఆంధ్రాబ్యాంక్‌లో అటెండర్ గా పనిచేస్తున్న వెంకటస్వామిపై అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు .దీంతో అటెండర్ మెడ మీద తీవ్ర గాయమవడంతో అతను బ్యాంక్‌లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అటెండర్ వెంకటస్వామిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత కొద్ది రోజులుగా లోన్ కోసం బ్యాంక్‌కు పలుమార్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement