ఇటుక బట్టీ యజమాని దాష్టీకం

bricks workers are facing problems in peddapalli - Sakshi

కార్మికులపై దాడి.. ఆపై చిత్రహింసలు 

 చింతకుంట శివారులోని  ఇటుక బట్టీలో ఘటన

 కార్మిక సంఘాలు, టాస్క్‌ఫోర్స్‌ అండతో విముక్తి 

కొత్తపల్లి(కరీంనగర్‌) : పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులపై ఓ ఇటుక బట్టీ యజమా ని కర్కశంగా ప్రవర్తించాడు. ఆడ, మగ అని చూడకుండా తీవ్ర చిత్రహింసలకు గురిచేశా డు. ఈ ఘటన కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని వీబీఐ ఇటుకబట్టీలో చోటుచేసుకుంది. కార్మిక సం ఘాల సహకారంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు 18 మందికి విముక్తి కలిగించారు. వీరిలో 11 మంది కూలీలు, ఏడుగురు చిన్నారులున్నారు. 

ఏం జరిగిందంటే.. 
ఒడిశా రాష్ట్రం బొలంగిర్‌ జిల్లా బెల్‌పడా మండలం గగ్రూలీ గ్రామానికి చెందిన హిమాన్షు చురా, భానుచురా, జుగే చురా, రమేష్‌ మహందా, ముని తండి, రాజబంటి చురా, రాణిమహందా, ఆశిష్‌ మహందా, పట్నాగర్‌ మండల కేంద్రానికి చెందిన అశోక్‌ సునా, తుర్కెలా మండలం కాంటాబాంజీ గ్రామానికి చెందిన లలితా పణిక, గోపాల్‌ పణిక, సీమ పణిక, భాస్కర సునా, సునిలీ సుర , రాజు పనిక మమతా మహానంద్, డొబో మహందా, ఆశిమహందాలు గత నవంబర్‌లో జీవనోపాధి కోసం చింతకుంట శివారులోని వీబీఐ ఇటుక బట్టీల కంపెనీలో కూలీలుగా చేరారు. ఒడిశాకు చెందిన సర్ధార్‌ గణేష్‌ అనే బ్రోకర్‌ వీబీఐ కంపెనీ యజమాని నారాయణరావుతో ఒప్పందం కుదుర్చుకొని కొంత మొత్తాన్ని కార్మికులకు అడ్వాన్స్‌గా అందించాడు.

 యజమాని చిత్రహింసలు 
పనిలో చేరినప్పటి నుంచి నారాయణరావు కూలీలను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశాడు. పనికి ఒత్తిడిచేయడం, జ్వరం వచ్చిన పట్టించుకోకుండా దాడిచేశాడు. దీంతో వారు ఒడిశాకు చెందిన శ్రామిక అధికార్‌ మంచ్‌ కార్మిక సంఘానికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సదరు యజమాని వారివద్దనున్న సెల్‌ఫోన్లు లాక్కుని బ్రోకర్‌కు సమాచారమిచ్చారు. బ్రోకర్‌ గణేశ్‌ ఇక్కడకు చేరుకుని 18 మందిని గోదావరిఖని గంగానగర్‌లో ఉన్న జీఎల్‌కే ఇటుక కంపెనీకి తరలించాడు. 

స్పందించిన  కార్మిక సంఘాలు 
ఈ విషయమై స్థానిక తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్‌ నాయకులు జిల్లా కార్మిక అధికారికి డిసెంబర్‌ 31న ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో కరీంనగర్‌ అడిషనల్‌ సీపీకి ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి వారికి పనిస్థలం నుంచి విముక్తి కలిగించారు. రేకుర్తిలోని సాయిమహాలక్ష్మీ గార్డెన్స్‌లో ఆశ్రయం కల్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి వాంగ్మూలం స్వీకరించారు. యజమాని నారాయణరావుపై కేసు నమోదు చేíసినట్లు ఎస్సై పి.నాగరాజు తెలిపారు. కార్మికులకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

చైల్డ్‌ లేబర్‌ ఆక్ట్‌ కింద మరో కేసు 
ఒడిశా కార్మికులకు చెందిన మైనర్‌ పిల్లలను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు వారిని అక్రమంగా నిర్బంధించినందుకు చైల్డ్‌ లేబర్‌ ఆక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఫర్వీన్‌ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top