బాలుడు అదృశ్యం | Boy missing hails from Jayaram Nagar | Sakshi
Sakshi News home page

బాలుడు అదృశ్యం

May 19 2015 8:10 PM | Updated on Jul 12 2019 3:29 PM

ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

కుత్బుల్లాపూర్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. జయరామ్‌నగర్ కు చెందిన సోమయ్య కుమారుడు శరత్(16) సోమవారం సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

రాత్రైనా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టు పక్కల, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం బాలుడు తండ్రి సోమయ్య పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement