ప్రమాద వశాత్తు సంపులోపడి బాలుడి మృతి.
ప్రమాద వశాత్తు సంపులో పడి ఓ చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరి ఖని పట్టణంలోని గంగానగర్ లో ఆదివారం జరిగింది. సునీల్(5) అనే బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ సంపులో పడ్డాడు. సంపులో బాలుడు పడి సంగతి ఎవరూ గమనించక పోవడంతో.. ఊపిరాడక బాలుడు మరణించాడు.