21న ‘బోనాల’ సెలవు | bonalu festival | Sakshi
Sakshi News home page

21న ‘బోనాల’ సెలవు

Jul 19 2014 12:25 AM | Updated on Sep 2 2017 10:29 AM

21న ‘బోనాల’ సెలవు

21న ‘బోనాల’ సెలవు

హైదరాబాద్ జిల్లాలో ఆదివారం ఆషాఢ బోనాలు జరుగనున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు సోమవారం సెలవు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది.

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఆదివారం ఆషాఢ బోనాలు జరుగనున్న నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాలకు సోమవారం సెలవు ఇచ్చేందుకు సర్కార్ సుముఖత వ్యక్తం చేసింది.  జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగమంతా ఆదివారం ఉత్సవ ఏరాట్లలో నిమగ్నమైనందున సోమవారం సెలవు ఇవ్వాలని కలెక్టర్ ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వానికి లేఖ రాశారు.

కలెక్టర్ లేఖకు స్పందించిన సర్కారు హైదరాబాద్ జిల్లాలో సోమవారం సెలవుకు అంగీకరించింది. అయితే ఏఏ ప్రభుత్వ విభాగాలకు సెలవు ఇవ్వాలనే విషయంపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 21న సెలవు విషయమై శనివారం అధికారికకంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement