కేసీఆర్‌ చిలక పలుకలు పలికిస్తున్నారు | bjp leader fires on cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ చిలక పలుకలు పలికిస్తున్నారు

May 4 2017 8:26 PM | Updated on Mar 29 2019 9:31 PM

కేసీఆర్‌ చిలక పలుకలు పలికిస్తున్నారు - Sakshi

కేసీఆర్‌ చిలక పలుకలు పలికిస్తున్నారు

మిర్చి రైతుల పరిస్థితికి సీఎం కేసీఆర్ అసమర్థతే కారణమని బీజీపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్‌సిటీ: మిర్చి రైతుల పరిస్థితికి సీఎం కేసీఆర్ అసమర్థతే కారణమని బీజీపీ సీనియర్‌ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మండిపడ్డారు. విలేకరులతో మాట్లాడుతూ..భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్ రావు సచివాలయం నుంచి అధికారికంగా మాట్లాడితే కేంద్రం నుంచి సరైన జవాబు వచ్చేదన్నారు. రాజకీయం చేయటం కోసమే పార్టీ కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడారని విమర్శించారు. మిర్చి కోసం రైతులు ఆందోళన చేస్తుంటే..కేంద్రం వెంటనే స్పందించిందని తెలిపారు.

మంత్రి హరీష్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, హరీష్ రావు ఎందుకు సచివాలయం లో మాట్లాడలేదని ప్రశ్నించారు. రాజకీయంగా బీజేపీని తిట్టడానికి మాత్రమే పార్టీ కార్యాలయంలో హరీష్ రావు సమావేశం ఏర్పాటు చేశారని మండిడ్డారు. హరీష్ రావు మార్కెట్ ఇంటర్ వెన్షన్ ఫండ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్క్ ఫెడ్ నుంచి కొనటానికి ఎందుకు కష్టమవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ , హరీష్ రావుతో చిలుక పలుకులు పలికిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం వంకరగా మాట్లాడి రైతులను మోసం చేయవద్దని కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement