భృతి కోసం బీడీ కార్మికుల ధర్నా | bidi workers agitation in kammarpalli | Sakshi
Sakshi News home page

భృతి కోసం బీడీ కార్మికుల ధర్నా

Feb 27 2015 1:46 PM | Updated on Sep 2 2017 10:01 PM

ఎటువంటి ఆంక్షల్లేకుండా అందరికీ జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులు ధర్నాకు దిగారు.

నిజామాబాద్ : ఎటువంటి ఆంక్షల్లేకుండా అందరికీ జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులు ధర్నాకు దిగారు. ఆసరా పథకం కింద లబ్ధి పొందుతున్న కార్మికులు అందరికీ జీవన భృతి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కార్మికులు మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం ఆందోళన చేపట్టారు. కార్మికుల వివరాలను కార్మికశాఖతో కానీ బీడీ కమిషన్ ఏజెంట్ల నుంచి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
(కమ్మర్‌పల్లి)

Advertisement
 
Advertisement
Advertisement