కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికుల ఆందోళన | bidi workers agitation in kammarpalli | Sakshi
Sakshi News home page

కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికుల ఆందోళన

Feb 12 2015 3:08 PM | Updated on Sep 2 2017 9:12 PM

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులు ఆందోళన చేశారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో బీడీ కార్మికులు ఆందోళన చేశారు. బీడీ కట్టలపై గొంతు క్యాన్సర్ బొమ్మను ముద్రించాలనే కేంద్ర ప్రభుత్వ జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చిన కార్మికులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

(కమ్మర్‌పల్లి)

Advertisement
 
Advertisement
Advertisement